E.G: కొవ్వూరు మండలం వేములూరుకు చెందిన 21 రోజుల చిన్నారి వైద్య చికిత్సకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా రూ.3,02,817 విలువైన LOC మంజూరైంది. రాజమహేంద్రవరం రైన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న చిన్నారి కుటుంబానికి కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు LOC పత్రాన్ని అందజేశారు. పేద కుటుంబాలకు ఆపద సమయంలో అండగా నిలవడమే తన బాధ్యతని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నారి వైద్యానికి CMRF సాయం


