హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెదకాకాని ఆలయ సిబ్బంది సస్పెండ్

GNTR: పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో భ్రమరాంబ అమ్మవారి బంగారు మంగళసూత్రాలు అదృశ్యమైన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఉప ప్రధాన అర్చకుడు జాలయ్యతో పాటు విజయ్ ప్రతాప్, విశ్వనాథ్, గాయత్రి మణికంఠ శాస్త్రి, కాంట్రాక్ట్ అర్చకుడు గర్నెపూడి గిరికుమార్‌లను సస్పెండ్ చేసినట్లు ఈవో లీలాకుమార్ తెలిపారు.