నారాయణపేట జిల్లా మక్తల్‌లోని తన నివాసంలో మంత్రి వాకిటి శ్రీహరి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వైద్యులు వెంటనే అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అయితే మెరుగైన వైద్య సేవల కోసం ఆయన ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
మంత్రి శ్రీహరికి స్వల్ప అస్వస్థత


