హైదరాబాద్: 28°C
వార్తలు

వరద బీభత్సం.. 500 మంది గల్లంతు

నేపాల్‌లోని ఉత్తర సరిహద్దు ప్రాంతంలో మెరుపు వరదలు సంభవించాయి. టిబెట్ పీఠభూమి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వల్ల భోటేకోశీ నది ఒక్కసారిగా ఉప్పొంగి నేపాల్ సరిహద్దు జిల్లాలను ముంచెత్తింది. ఈ వరదల కారణంగా 500 మంది గల్లంతయ్యారు. ఇందులో 105 మందికి పైగా భారతీయులు కూడా ఉన్నట్లు నేపాల్ తెలిపింది. వందల సంఖ్యలో ఇళ్లు, వంతెనలు కూడా కొట్టుకుపోయాయి.