హైదరాబాద్: 28°C
తెలంగాణ

దైవ దర్శనానికి వెళ్లి అనంత లోకాలకు

ADB: జిల్లాలో విషాద ఘటన చోటచేసుకుంది. ఇంద్రవెల్లి మండలం వాల్గొండకు చెందిన పెందూర్ శంకర్(42) తిరుపతి వెంకన్న దర్శనం ముగించుకుని తిరిగి కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైల్లో ఇంటికి వస్తుండగా, ముత్కేడ్ సమీపంలో ఫిట్స్ వచ్చింది. ఆదిలాబాద్ చేరాక పరీక్షించిన వైద్యులు శంకర్ మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.