BDK: అశ్వారావుపేట–భద్రాచలం ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆటోలో అశ్వరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు


