KKD: పిఠాపురం పట్టణంలో రైతు బజార్ కోసం మార్కెట్ కమిటీ నిధులతో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన షాపులు ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు. మున్సిపల్, మార్కెట్ కమిటీ శాఖల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణమని స్థానికులు చెబుతున్నారు. కొందరు షాపులను ఆక్రమించి స్థావరాలుగా మార్చుకున్నారు. అధికారులు చర్యలు తీసుకుని రైతు బజార్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పిఠాపురంలో నిరుపయోగంగా రైతు బజార్


