హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే కృషితో ఆర్థిక భరోసా

SKLM: విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ఎమ్మెల్యే ఈశ్వరరావు కృషితో రూ.5 లక్షల పరిహారం అందింది. లావేరు మండలం చిన్న మురపాకకు చెందిన గేదెల లక్ష్మణరావు గతేడాది ఆమదాలవలసలో భవన నిర్మాణ పనిలో ఉండగా 11 కేవీ లైన్ తగిలి మృతి చెందారు. విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తేగా ఆయన విద్యుత్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నారు.