హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేషన్ బియ్యం తరలింపుకు అవస్థలు

ASF: తిర్యాణి మండలం మంగి గ్రామపంచాయతీ పరిధిలో రోడ్డు సౌకర్యం లేక రేషన్ బియ్యం సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బుధవారం బియ్యం లోడ్‌తో వచ్చిన లారీ గుట్ట ఎక్కకపోవడంతో పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ ద్వారా గ్రామాలకు తరలించి సరఫరా చేస్తున్నారు. రోడ్డు సౌకర్యం లేక ప్రతి ఏటా ఇదే సమస్య ఎదురవుతోందని స్థానికులు తెలిపారు. శాశ్వత రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.