KKD: కిర్లంపూడి మండలం జగపతినగరంలో పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. జాతరకు హాజరైన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మహిళలకు స్వయంగా బోనాలు నెత్తిన పెట్టి పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
బోనాలు ఎత్తిన మహిళలు


