హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శుద్ధ నీటినే ఇస్తున్నాం: కమిషనర్

GNTR: తాగునీటిపై ఆందోళన వద్దని మంగళగిరి-తాడేపల్లి కమిషనర్ అలీం బాషా అన్నారు. కృష్ణా నదిలో గోదావరి నీరు చేరడంతోనే రంగు మారిందన్నారు. తాడేపల్లిలో ఆయన పర్యటించారు. నీటిని పూర్తిగా శుద్ధి చేశాకే సరఫరా చేస్తున్నామని చెప్పారు. లీకేజీలను ఎప్పటికప్పుడు అరికడుతున్నామన్నారు. ప్రజలు తప్పనిసరిగా నీటిని కాచి, చల్లార్చుకుని తాగాలని సూచించారు.