హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్లపై గుంపులుగా కుక్కలు

SDPT: గజ్వేల్ పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా వీధికుక్కల బెడద తీవ్రరూపం దాల్చింది. రహదారులపై గుంపులుగా చేరుతూ.. కాలినడకన వెళ్లే వారిని, వాహనదారులను వెంటపడి వేధిస్తున్నాయి. కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీస్తూ పలువురు ప్రమాదాల బారిన పడి గాయపడుతున్నారు. అధికారులు స్పందించి వీధికుక్కలను నివారించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.