హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ర్యాలి జగన్మోహిని ఆలయంలో మాస కళ్యాణం

కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలి జగన్మోహిని కేశవ, గోపాల స్వామివారి దేవస్థానంలో నెలలో ఒకసారి మాత్రమే నిర్వహించే శ్రవణ నక్షత్ర మాస కళ్యాణాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ మాస కళ్యాణంలో పాల్గొని స్వామివారిని దర్శించి మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈవో సురేష్‌బాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు.