MDK: చిన్నశంకరంపేట, పీఏసీఎస్‌కు 560 యూరియా బస్తాలు చేరుకున్నాయని సొసైటీ సీఈఓ రమేష్ వెల్లడించారు. ఎరువుల కోసం రైతులు 'ఫార్మర్ ఫ్రేమ్ వర్క్ ఫర్ సేల్స్' యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. యాప్‌లో ముందస్తుగా బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా విక్రయిస్తామని, అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.
తెలంగాణ
పీఏసీఎస్‌కు యూరియా రాక


