హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోతిరెడ్డిపాడు సందర్శన అడ్డుకోవడం సరి కాదు'

ATP: రాయలసీమ నీటి హక్కుల పరిరక్షణకు చేపట్టిన పోతిరెడ్డిపాడు సందర్శనను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేయడమేనని గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల పరిరక్షణ సమితి కోఆర్డినేటర్ సిబ్యాల విజయభాస్కర్ ఖండించారు. చంద్రబాబు నాయుడు సీమ రైతుల సమస్యలపై శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు. హక్కుగా రావాల్సిన నీటి బొట్టు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు.