హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉద్యోగం ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి

VZM: బొబ్బిలిలోని క్యాన్సర్‌తో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు జలగడుగుల శ్యామల కుమార్ భార్యకు ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయూ నాయకులు ఎమ్మెల్యే బేబీనాయనకు వినతిపత్రం అందజేశారు. 18 నెలలుగా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. ఈ నెల 27 నుంచి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపడతామని, సెప్టెంబరు 5లోగా పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.