VZM: గజపతినగరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారికి అడ్డుకట్టు వేయాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు మేటికోటి భాస్కరరావు కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం గజపతినగరం ఎస్సై కిరణ్ కుమార్ నాయుడుకు వినతి పత్రం అందజేశారు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సాయంత్రం సమయంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలి'


