హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డివైడర్‌ను ఢీకొని యువకుడి స్పాట్‌డెడ్

NTR: విజయవాడ పటమటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై హైస్కూల్ రోడ్డు వైపు వెళ్తుండగా వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన మొహమ్మద్ హజార్ అక్కడికక్కడే మృతి చెందాడు. పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.