W.G: తణుకు మండలం పైడిపర్రు పరిధిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పైడిపర్రు నుంచి మండపాక వెళ్తున్న బైక్‌ను క్వారీ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. హెల్మెట్ ధరించినప్పటికీ తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
క్వారీ లారీ ఢీకొని యువకుడి మృతి


