KRNL: కోస్గి-ఆదోని ప్రధాన రహదారిలోని మల్లెన వాగు వద్ద వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టును అధికారులు పునర్నిర్మించారు. అయితే కల్వర్టు పక్కనే ఉన్న భారీ గుంతను పూడ్చకుండా వదిలేయడంతో ప్రమాదం పొంచి ఉంది. ఎదురెదురుగా రెండు భారీ వాహనాలు వచ్చినప్పుడు సైడ్ ఇచ్చే క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కల్వర్టు నిర్మించి.. గుంత వదిలేసి


