WGL: వర్దన్నపేట మండలం ఇల్లంద దేవాదుల ప్రాజెక్టు నీటిని గ్రామానికి అందించాలని కోరుతూ రైతులు బుధవారం ఎమ్మెల్యే నాగరాజును కలిశారు. రైతుల సమస్యపై ఆరా తీసిన ఎమ్మెల్యే సంబంధిత ఐబీ అధికారులతో నీటి సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు సాగునీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
దేవాదుల నీటి కోసం MLAను కలిసిన రైతులు


