హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ నాయకుల పరామర్శ

MLG: కన్నాయిగూడెం(M)లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను బుధవారం కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. సర్వాయి పరిధి చిట్యాల గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు బొచ్చుసూరయ్య కుటుంబానికి పెద్దకర్మ కోసం 50కేజీల బియ్యం అందజేశారు. ముప్పనపల్లి సర్పంచ్ తిప్పనపల్లి లక్ష్మయ్య తండ్రి నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.