WGL: నర్సంపేట పట్టణంలోని విజ్డమ్ హైస్కూల్‌లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈవో కుర్ర సారయ్య మొక్కలు నాటారు. ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటి సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఆయన అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని యుద్ధంలా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
హైస్కూల్‌లో మొక్కలు నాటిన ఎంఈవో


