హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన

అనంతపురం: మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని గుత్తి ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ముస్లిం మత పెద్ద అన్వర్ పాషా హుసేని హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. రక్తదానం మహాదానమని రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని వారు పిలుపునిచ్చారు.