హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మహిళల సంరక్షణకై శక్తి టీం: ఏఎస్సై

ELR: నూజివీడు స్నేహ రైడ్స్ బాలికల హాస్టల్‌లో బాలికలు, మహిళల రక్షణకు సంబంధించి బుధవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శక్తి టీం ఏఎస్సై ఎన్ వి ఫణిభూషణరావు మాట్లాడుతూ.. మహిళల సంరక్షణకు శక్తి టీం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. సైబర్ నేరాలు, జీరో ఎఫ్‌ఐ‌ఆర్‌లను వివరించారు. అత్యవసర సమయాలలో 112,1930,1038 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలన్నారు.