హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమర్జనం ఏర్పాటు పరిశీలించిన కలెక్టర్

ఖమ్మం పట్టణంలో రానున్న గణేష్ చతుర్థి సందర్భంగా విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బ్రిడ్జి వద్ద కొనసాగుతున్న నిర్మాణ పనులను అధికారులు సమన్వయంతో వేగవంతం చేయాలని సూచించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు.