హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫ్యాక్టరీ వ్యర్థాలపై రైతుల ధర్నా..!

VZM: రాజాం నియోజకవర్గంలోని సంకిలి గ్రామం సమీపంలో ఉన్న ప్యారి లిమిటెడ్ ఫ్యాక్టరీపై రైతులు ఆందోళకు దిగారు. ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న వ్యర్ధాల కారణంగా తమ పంట పొలాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ.. ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. గత కొంతకాలంగా ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్దాలు తమ వ్యవసాయ భూముల్లోకి చేరుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.