VSP: జిల్లాలోని దుక్కవానిపాలెం టోల్‌గేట్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు రెండు వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ రవి (36) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కారులో ఉన్న ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడినట్లు వారు పేర్కొన్నారు. వెంటనే వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించినట్లు తెలియజేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి!


