హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలవరం ఎడమ కాలువను పరిశీలించిన మంత్రి అనిత

AKP: పాయకరావు పేట మండలంలోని పోలవరం ఎడమ కాలువ పనులను రాష్ట్ర హోంమంత్రి అనిత, కలెక్టర్ విజయకృష్ణన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని అభివర్ణించారు. సీఎం వచ్చే నెల 3న ఇక్కడ నిర్వహించే జలహారతి కార్యక్రమం చేపడుతున్న ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.