హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్య వివాహాలు, నేరాల నివారణపై అవగాహన

సత్యసాయి: గుట్టూరులో కియా ఎస్ఐ రాఘవయ్య ఆధ్వర్యంలో నేరాల నివారణ, బాల్య వివాహాల నిరోధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్, పంచాయతీ సిబ్బందితో కలసి ఈ కార్యక్రమం చేపట్టారు. పోక్సో చట్టం, మహిళల రక్షణ, సీసీ కెమెరాల వినియోగంతో పాటు వినాయక చవితి వేడుకలు, రాబోయే ఎన్నికలను శాంతియుతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.