హైదరాబాద్: 28°C
వార్తలు

'యాంటీబయాటిక్స్ పనిచేయవు'.. IMA హెచ్చరిక

దేశంలో సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా(H1N1)/స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) అడ్వైజరీ జారీ చేసింది. వర్షాకాలంలో దేశవ్యాప్తంగా వస్తోన్న కేసులను చూసి భయాందోళన చెందొద్దని సూచించింది. ఫ్లూ లక్షణాలకు సొంతంగా యాంటీబయాటిక్స్ వాడకూడదని, వైరల్ ఇన్ఫెక్షన్లపై యాంటీబయాటిక్స్ పనిచేయవని హెచ్చరించింది. వైద్యుల సలహా మేరకే మందులు వాడాలని సూచించింది.