కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం దర్శించుకున్నారు. ఏడు వారాల మొక్కు పూర్తి చేసుకుని అష్టోత్తర పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు వారిని సత్కరించారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
వాడపల్లి వెంకన్న సన్నిధిలో కొవ్వూరు ఎమ్మెల్యే పూజలు


