హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండాలి'

కృష్ణా: పెనమలూరులో ఓటర్ల జాబితా పరిశీలనపై కలెక్టర్ డీకే బాలాజీ ప్రజా విచారణ బుధవారం నిర్వహించారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై ఓటర్ల వాదనలు, ఆధారాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హులు, బహుళ నమోదులను నిబంధనల మేరకు గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.