హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేణిగుంటలో వినాయక విగ్రహ నిర్వాహకులతో సమావేశం

TPT: వినాయక విగ్రహాల నిర్వాహకులతో రేణిగుంట పోలీసులు సమావేశం నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జన ఊరేగింపు నిర్వహించేందుకు పోలీసు ఉన్నతాధికారుల సూచనలు, నిబంధనలను నిర్వాహకులకు వివరించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జయచంద్ర పాల్గొన్నారు.