హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళ మెడలో బంగారం లాక్కెళ్లిన దుండగులు

నెల్లూరు: పొదలకూరు మండలం మర్రిపల్లిలో చోరీ జరిగింది. రమాదేవి అనే మహిళ మెడలోని 32 గ్రాముల పుస్తెలతాడు, కాసులను దుండగులు లాక్కెళ్లారు. చోరీకి గురైన బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని బాధితురాలు తెలిపింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పుస్తెలతాడు లాక్కెళ్లడంతో బాధితురాలు కన్నీరుమున్నీరవుతోంది.