NTR: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో రూ. 36 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'


