BPT: అద్దంకి - మేదరమెట్ల నామ్ హైవేపై బుధవారం ఉదయం ఒక కారు ప్రమాదం జరిగింది. అద్దంకి నుంచి మేదరమెట్ల వైపు వెళ్తున్న కారు, రోడ్డు డివైడర్ దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో సదరు వ్యక్తి తలకు, శరీరానికి బలమైన రక్తగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ప్రయాణికులు గాయపడిన వ్యక్తిని అదే కారులో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అద్దంకి-మేదరమెట్ల రహదారిపై రోడ్డు ప్రమాదం


