హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సాదిక్ ఖాన్ ను కఠినంగా శిక్షించాలి'

AKP: కాకినాడ జిల్లాలో ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్యలకు కారణమైన సాదిక్‌ఖాన్‌ను కఠినంగా శిక్షించాలని ఎలమంచిలి బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణ, గ్రామీణ అధ్యక్షులు బొద్దపు శివ, అగ్రహారపు కుమారస్వామి ఆధ్వర్యంలో కార్యకర్తలు గ్రామీణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఎస్సై ఉపేంద్రకు వినతిపత్రం అందజేశారు. బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.