హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు

కడప నగరంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం ఆధ్యాత్మిక జూలూస్‌ ర్యాలీ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అల్మాసే పేట ఇనాయత్‌ఖాన్‌ తాలీమ్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన సర్కిళ్ల మీదుగా ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు సాగింది. మత పెద్దలు పండుగ విశిష్టతను వివరించి, మహమ్మద్‌ ప్రవక్త చరిత్ర ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు.