హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఖాళీ బిందెలతో మహిళల నిరసన

AKP: ఎస్సీ, బీసీ కాలనీల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని స్థానికులు తెలిపారు. బుధవారం స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో వీధుల్లో ర్యాలీ నిర్వహించి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వేసిన పాత బోర్లు ఎండిపోయి, తాగేందుకు చుక్క నీరు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ట్యాంకర్ల ద్వారా రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని కోరారు.