ప్రకాశం: మార్కాపురంలోని నటరాజ్ సెంటర్ వద్ద తప్పిపోయి ఇద్దరు చిన్నారులను స్థానికులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. చిన్నారుల వివరాలు, ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో తల్లిదండ్రులు పోలీసులను సంప్రదించారు. ఎస్సై విశ్వనాథరెడ్డి, సిబ్బంది వెంటనే స్పందించి చిన్నారులను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల చొరవను పలువురు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నారి మిస్సింగ్.. పోలీసుల ఫాస్ట్ యాక్షన్!


