హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సుప్రభాత సేవకు పెరిగిన ఆదరణ

VSP: విశాఖలోని సింహాద్రి అప్పన్నస్వామి ఆలయంలో వేకువజామున జరిగే సుప్రభాత సేవకు భక్తుల నుంచి ఆదరణ పెరిగింది. ఈ సేవ టికెట్లు అక్టోబరు నెలాఖరు వరకు బుక్ అయ్యాయి. ప్రస్తుతం రోజుకు 20 మందికే అవకాశం ఉన్నట్లు ఈవో వెంకటరావు తెలిపారు. డిమాండ్ దృష్ట్యా మరో 10 మందికి అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.