TG: ఖమ్మంలో స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో గురుకుల పాఠశాల నిర్మిస్తామన్నారు. సంస్కారవంతమైన విద్య అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. గురుకులానికి స్థలం కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ.. విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని పేర్కొన్నారు.
వార్తలు
గురుకుల పాఠశాలకు తుమ్మల శంకుస్థాపన


