హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా మదర్ థెరీసా జయంతి వేడుకలు

VZM: మదర్‌ థెరిసా 116వ జయంతి సందర్భంగా బుధవారం స్దానిక బొబ్బాధిపేటలోని 38వ డివిజన్‌లో ఆమె విగ్రహానికి ఆల్ ఇండియా బాడీ ఆర్గాన్ డోనర్స్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శిణగం శివాజీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. మురికివాడలలోని అనాథలు, అభాగ్యులు, కుష్టు రోగులను అక్కున చేర్చుకుని మదర్‌ థెరీసా అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు.