హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడిగా వీరస్వామి

ఎన్టీఆర్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడిగా వీరంకి వీరస్వామి ఎన్నికయ్యారు. అనంతరం ఇవాళ నందిగామ మండలం కంచల గ్రామ ప్రజలు ఘనంగా శాలువాతో పూలమాలలతో సత్కరించి స్వీట్లు పంచిపెట్టారు. అధ్యక్ష పదవి అనేది కేవలం ఒక పదవి కాదని అది మన సమాజానికి సేవ చేసే బాధ్యత అని అన్నారు. తమ కులంతో పాటు ఇతర కులాలను గౌరవించాలని వీరాస్వామి పేర్కొన్నారు.