కాకినాడ: శంఖవరం మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ గుర్తించిన ఓటర్ల ముసాయిదా జాబితాను నోటీసు బోర్డుల్లో ప్రచురించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సర్క్యూలర్ నెం.25 ప్రకారం జాబితాలను అందుబాటులో ఉంచినట్లు ఎంపీడీవో తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉన్నవారు ఈ నెల 28లోగా సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సమర్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఓట్ల జాబితా అభ్యంతరాలను ఈ నెల 28లోగా సమర్పించాలి'


