హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరులో యథేచ్ఛగా ప్లాస్టిక్ వాడకం

GNTR: అధికారుల పర్యవేక్షణ లోపంతో గుంటూరులో నిషేధిత ప్లాస్టిక్ వాడకం విచ్చలవిడిగా సాగుతోంది. తయారీ కేంద్రాలపై చర్యలు లేకపోవడంతో కూరగాయల షాపులు, హోటళ్లలో కవర్ల వినియోగం ఆగడం లేదు. ప్రతీ ఒక్కరూ రోజుకు 25-50 గ్రాముల ప్లాస్టిక్ వాడటంతో వ్యర్థాలు పేరుకుపోయి పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.