హైదరాబాద్: 28°C
వార్తలు

‘అగ్రిస్టాక్‌లో AI సాంకేతికతను వినియోగించాలి’

డిజిటల్ వ్యవసాయ మిషన్‌లో భాగంగా అగ్రిస్టాక్‌ను సమీక్షించిన PM మోదీ, వ్యవసాయ డేటా నుంచి మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు AI వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలని సూచించారు. మరోవైపు డిజిటల్ అరెస్ట్ వంటి సైబర్ మోసాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రజల్లో, ముఖ్యంగా యువత, వృద్ధుల్లో అవగాహన పెంచాలన్నారు. సిబ్బందికి శిక్షణ ఇచ్చి నేరాలను వేగంగా అణచివేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.