హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దాదాపు పూర్తి కావచ్చిన పోలవరం కాలువ

AKP: పాయకరావుపేట వద్ద రెండు కొండలను తొలిచి పోలవరం కాలువను నిర్మిస్తున్నారు. సుమారు 100 మీటర్ల ఎత్తులో కొండలను తవ్వి నిర్మిస్తున్న కాలువ నిర్మాణ పనులు దాదాపు పూర్తికావచ్చాయని పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్ట్ డీఈ హరి ప్రసాద్ బుధవారం తెలిపారు. 6ఏ ప్యాకేజ్ కింద పాయకరావుపేట నుంచి దార్లపూడి వరకు 25 కిలోమీటర్ల కాలువను నిర్మిస్తున్నామన్నారు.