హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.30 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల సమీక్ష

ప్రధాని మోదీ నేతృత్వంలో నిర్వహించిన '53వ ప్రగతి' సమావేశంలో 9 రాష్ట్రాల్లోని రూ.30 వేల కోట్లకు పైగా వ్యయంతో కూడిన ఆరు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులను ఆయన సమీక్షించారు. ప్రాజెక్టులను విడిభాగాలుగా కాకుండా ఒక సమగ్ర వ్యవస్థగా చూడాలని, జాప్యం వల్ల ప్రజలకు అందే ప్రయోజనాలు ఆలస్యమవుతాయని ప్రధాని పేర్కొన్నారు. అన్ని దశల్లో సంస్కరణలు, వేగంతో పాటు నాణ్యత ఉండాలని ఆయన స్పష్టం చేశారు.